కోస్తాంధ్రకు వర్షసూచన..

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 07:06 PM
 

వేసవి తాపంతో అల్లాడుతున్న కోస్తా ప్రజలకు చల్లని శుభవార్త. గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ వ్యాపించి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.