వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఎవరూ మిగలరు..!

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 04:37 PM
 

 వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఎవరూ మిగలరు అని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్.. ఈసీ అధికారులకు పట్టుబడిన టీటీడీకి చెందిన బంగారం విషయంపై స్పందించిన ఆయన.. బంగారం తరలింపులో టీటీడీది ఎటువంటి తప్పు లేదని స్పష్టం చేశారు. టీటీడీకి చెందిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తోందని, టీటీడీ ఖజానా నుంచి తీసుకెళ్లీ మళ్లీ అప్పగించే బాధ్యత కూడా బ్యాంకులదేనన్నారు. బంగారం తరలింపుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ రాజేంద్రప్రసాద్.. బ్యాంకులు కేంద్రం ఆధీనంలో ఉంటాయని.. అందుచేత తమకు కేంద్రంపైనే అనుమానం ఉందన్నారు. టీటీడీ ఈవో సింఘాల్ ఎందుకు.. ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు రాజేంద్రప్రసాద్. ఇక, ఏపీలో ముఖ్యమంత్రికి అధికారాలు లేవని సీఎస్‌ ఎలా అంటారని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ... తెలంగాణలో సీఎం సమీక్షలు చేయవచ్చు.. కానీ, ఏపీలో సమీక్ష చేయకూడదా? అని ప్రశ్నించారు రాజేంద్రప్రసాద్.