ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 02:07 PM
 

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం అనంతరం తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.