అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 01:55 PM
 

అగ్నిప్రమాదం లో సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట గొల్ల పుంత వేగుళ్ళ వీర్రాజు కాలనీలోని ప్లాట్ నెంబర్ 1801లో నివసిస్తున్న అరుగళ్ల నాని కి చెందిన ఇంట్లో తలగడలు ,పరుపులు,దిండ్లు తయారుచేసే సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయిన సంగతి విదితమే. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకోవడంతో దిండ్లు పరుపులు మొత్తం కాలి బూడిదకాగా ప్రమాద వార్త తెలుసుకున్న శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.