బంగారం తరలింపులో టీటీడీ తప్పులేదు : రాజేంద్రప్రసాద్

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 01:54 PM
 

అమరావతి :  బంగారం తరలింపులో టీటీడీ తప్పులేదని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ బ్యాంక్ దేనన్నారు. వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఎవరూ మిగలరని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలంగాణలో సీఎం సమీక్షలు చేయవచ్చు కానీ… ఏపీలో చంద్రబాబు సమీక్ష చేయడకూడదా అని ప్రశ్నించారు.