మత్స్యకారుల వలలో చిక్కిన 15 అడుగుల భారీ కొండ చిలువ

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 01:30 PM
 

చేపల వలలో 15 అడుగుల భారీ కొండ చిలువ చిక్కిన వైనం గురువారం ఉదయం అంకంపాలెంలో జరిగింది. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం శివారుపాటి చెరువు వద్ద ఉన్న కాలువలో, ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో మత్స్యకారులు చేపలు పడుతుండగా.. మత్స్యకారుల వలలో 15 అడుగుల భారీ సైజున్న కొండ చిలువ చిక్కింది. వెంటనే మత్స్యకారులంతా ఆ కొండ చిలువను బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు.