పనాజీ నుంచి పారికర్‌ కుమారుడు పోటీ!

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 12:44 PM
 

గోవా : పనాజీ శాసనసభ నియోజకవర్గం నుంచి దివంగత సీఎం మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పల్‌ పారికర్‌(38) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మనోహర్‌ పారికర్‌ మరణించిన అనంతరం పనాజీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మే 19న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి ఉత్పల్‌ పారికర్‌ను బరిలో దింపాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఉత్పల్‌ పారికర్‌ అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాపారిగా ఉన్నారు.