మే 9న హాజరు కావాలని జైరాంరమేశ్‌కు ఢిల్లి కోర్టు ఆదేశం

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 12:37 PM
 

న్యూఢిల్లి : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఒక పరువునష్టం కేసులో మే 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఢిల్లి కోర్టు ఒకటి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌ దోవ్‌ కుమారుడు వివేక్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసులో జైరాం రమేశ్‌ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులైన కార్వాన్‌ పత్రిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌, ఆ పత్రిక విలేఖరి కోర్టులో హాజరు కావడంతో అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ వారికి బెయిల్‌ మంజూరు చేశారు. కాగా నేడు కోర్టుకు హాజరు కాలేనంటూ జైరాం రమేశ్‌ దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు ఆమోదించి ఆయనకు మినహాయింపునిచ్చింది.