రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భేటీ అయ్యారు. రష్యా పర్యటనకు వెళ్లిన కిమ్ కు పుతిన్ కరచాలనం చేసి, స్వాగతం పలికారు. రష్యాలోని వ్లాడివోత్సోక్ నగరంలో వీరి సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో పాల్గొనేందుు కిమ్ తన ప్రైవేట్ రైలులో రష్యాకు వెళ్లారు. కొరియా ద్వీపకల్పానికి సంబంధించిన న్యూక్లియర్ సమస్యపై ఈ భేటీ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కిమ్ చర్చలు విఫలమైన నేపథ్యంలో... ఇప్పుడు వీరిద్దరి మధ్య చర్చ జరుగుతోంది.