జగన్ సీఎం నేమ్‌బోర్డ్‌లు రాసుకోవడంపై స్పందించిన చంద్రబాబు !

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 10:02 PM
 

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేమ్‌ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు.  తిరుపతిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఆయన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూవైసీపీ గెలుస్తుందని సీఎం అంటూ నేమ్‌బోర్డ్‌లు రాసుకోవడం చూశామని అయితే అసలు నిజాలు తెలియడంతో నేతలు పారిపోయారన్నారు. అధికారులపై ఉన్న కేసుల జగన్ వల్ల కలిగిన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు అధికారులపై ఎలాంటి ద్వేషం లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడా రాజీపడలేదు..!తిరుపతి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభించాను. సమస్యలపై విద్యార్థి దశ నుంచి సీఎంగా సైతం పోరాటం చేస్తున్నాను. ఆగస్టు 1984 లో ఇబ్బందులు అధిగమించి టీడీపీ అదికారంలోకి వచ్చేలా పని చేశాను. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని విభజన సమయంలో కోరాను. ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఏపీకి న్యాయం చేయాలని పోరాటం చేశాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడా రాజీపడలేదు. నాకు వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్, సీబీఐతో వివాదం లేదు. ప్రపంచంలో ఎక్కడ ఈవీఎంల వినియోగం సద్వినియోగం కాలేదు. ఎన్నికల రోజు శాంతి భద్రతలకు భంగం కలిగించారు. ఓటర్లను పోలీంగ్‌కు దూరం చేసేలా వ్యవస్థ పనిచేయడం బాధాకరం. రాష్ట్రంలో నాలుగు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులతో సమీక్షలకు సైతం .