ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం!జేబులోకి వేసుకుంటు న్న పింఛన్‌‌లు!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:35 PM
 

కడప బద్వేలులో ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రెండు సంవత్సరాల నుంచి మృతి చెందిన వారి పేరుతో పింఛన్‌‌లను జేబులోకి వేసుకుంటున్న ఘటన వెలుగు వచ్చింది. విజయ్ అనే ఉద్యోగి.. రెండేళ్ల నుంచి సుమారు రూ.6 లక్షలు కాజేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ విజయ్ సింహారెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు విజయ్‌ను విధుల్లోకి తీసుకోవద్దని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.