జబర్దస్త్ టీమ్ పై రోజా ఫైర్‌!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:23 PM
 

ఇటీవల ఎన్నికల సమయంలో జబర్దస్త్ టీమ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇల్లిళ్లూ తిరిగింది. పవన్ కల్యాణ్‌కే మీ ఓటు.. నాగబాబుకే మీ ఓటూ అంటూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించింది. జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు నాగబాబు జడ్డి కావడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ఈ టీమ్‌లో చాలామంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా అందుకే తమ అభిమాన నాయకుల కోసం ఓట్ల పాట్లు పడ్డారు. ఇక్కడే ఇంకో ట్విస్టు కూడా ఉంది. ఇదే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో మరో న్యాయ నిర్ణేతగా నటి రోజా ఉన్నారు. ఆమె కూడా నగరి అసెంబ్లీ సీటు నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆమె తరపున ఒక్క నటుడు కూడా నగరిలో పర్యటించ లేదు. దీంతో రోజాకు చాలా కోపం వచ్చిందట. ఓ రోజా సుడిగాలి సుధీర్‌ ను పట్టుకుని నిలదీసిందట.. జబర్దస్‌ ప్రోగ్రామ్‌లో రోజా ఆహా..ఓహో.. అంటూ బిస్కట్లు వేస్తారు.. కానీ నా ప్రచారానికి రారా అంటూ మండిపడినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ఇద్దరు జడ్జిల్లో ఒకరివైపే అంతా మొగ్గిన తర్వాత కూడా మీతో కలసి పనిచేయడం కష్టం అని వాపోయిందట. ఎలాగూ తమ వైసీపీ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాలో ఉన్న రోజా.. ఇక జబర్దస్త్‌లో కనిపించకపోవచ్చంటున్నారు.