ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 05:20 PM

ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కళారత్న అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తారు. కళారత్న పురస్కారాలకు ఎంపికైన వారు


గొల్లపూడి మారుతీరావు, విశాఖ - నటుడు, రచయిత


వంగపండు ప్రసాదరావు, విశాఖ - జానపదం 


సతీష్ రెడ్డి, నెల్లూరు - సైన్స్


గరికపాటి నరసింహారావు, తూర్పుగోదావరి - అవధానం


వేమూరి వెంకట విశ్వనాథ్, కృష్ణా - సంగీతం


సాయికృష్ణ యాచేంద్ర, నెల్లూరు - సంగీతం, అవధానం


చెరుకూరి వీరయ్య, కృష్ణా - ఇంజినీరింగ్ 


పొత్తూరి వెంకటేశ్వరరావు, గుంటూరు - జర్నలిజం


బల్లెం రోశయ్య, కృష్ణా - ఇంజినీరింగ్‌


అనంత శ్రీరామ్‌, పశ్చిమగోదావరి - గేయ రచయిత


ఉమా చౌదరి, గుంటూరు - హరికథ


మహంకాళి సూర్యనారాయణశాస్త్రి, గుంటూరు - కూచిపూడి


సింగమనేని నారాయణ, అనంతపురం - సాహిత్యం


పి. సత్యవతి, కృష్ణా - సాహిత్యం


కె. సంజీవరావు, యానాం - కవిత్వం


గంగాధరశాస్త్రి, కృష్ణా - సంగీతం


చిట్టూరి రేవతి రత్నస్వామి, హైదరాబాద్‌ - సంగీత వాయిద్యం


డా. శారదా రామకృష్ణ, కృష్ణా - ఆంధ్ర నాట్యం


ఖలీషా అండ్‌ సుబానీ, ప్రకాశం - నాదస్వరం


మానేపల్లి రుషికేశవరావు, కృష్ణా - సాహిత్యం


కడలి సురేష్‌, నర్సాపూర్ - నాటకం


మారేమని శ్రీనివాసరావు, గుంటూరు - చిత్ర లేఖనం


ఎస్‌ఎం పీరన్‌, ప్రకాశం - శిల్పకళ


జయన్న, కడప - చిత్రకళ


అక్కల శ్రీరామ్‌, గుంటూరు - శిల్పకళ 


పల్లేటి లక్ష్మి కులశేఖర్‌, కడప - రంగస్థలం


ఉమామహేశ్వరి, కృష్ణా - హరికథ


నేతి పరమేశ్వర శర్మ, గుంటూరు - రంగస్థలం


ఎ. మురళీకృష్ణ, ప్రకాశం - వ్యాఖ్యాత 


తమ్మలపూడి కోటేశ్వరరావు, గుంటూరు - సాహిత్యం


మీగడ రామలింగస్వామి, శ్రీకాకుళం - నాటకరంగం


నాయుడు గోపి, గుంటూరు - రంగస్థలం 


పొట్లూరి హరికృష్ణ, అనంతపురం - తెలుగు భాషాభివృద్ధి


కె. శివప్రసాదరెడ్డి, కర్నూలు - హస్తకళలు 


కొండపోలు బసవపున్నయ్య, గుంటూరు - సంఘసేవ


డా. టీఎస్‌ రావు, కృష్ణా - సంఘసేవ


మన్నెం వెంకటరాయుడు, గుంటూరు - సంఘసేవ


డా. రాధాకృష్ణంరాజు, కర్ణాటక - సంఘసేవ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com