చంద్రబాబు జిమ్మిక్కులు ఆపాలి: వైసీపీ నేత బొత్స

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 05:23 PM
 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు ఆపాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్లలో చంద్రబాబు సీఎంగా ఏం చేశారో చెప్పలేకపోతున్నారని, ఏపీ దోచుకుంది తప్ప, చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే వైసీపీకి ముఖ్యమని, ఏపీకి ప్రత్యేక హాదా సాధన విషయమై కేసీఆర్ మద్దతు తెలుపుతానంటే వద్దని చెప్పాలా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏ రాష్ట్రం మద్దతిచ్చినా తీసుకుంటామని అన్నారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ టీడీపీ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ని అంగీకరిస్తూ చంద్రబాబు గతంలో రాసిన లేఖను కేంద్ర మంత్రి బయటపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు నల్లొచొక్కాలు ధరించి చంద్రబాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు.