చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భాస్కరరెడ్డి అనే వ్యక్తిని వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన అనుచరులు బెదరిస్తున్నారంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కరరెడ్డిని తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వారు బెదరిస్తున్నారన్నది ఫిర్యాదు సారాంశం. ఇదే నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కావడం, ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు కూడా భాస్కరరెడ్డే కావడంతో ఒకే పేరు ఉండటంతో ఓట్లు చీలుతాయన్న భావనతో భాస్కరరెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ బెదరిస్తున్నారని భాస్కరరెడ్డి, ఆయన భార్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి వర్గీయుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.