ఆర్‌ఎల్డీ అధినేత అజిత్ సింగ్ ఆస్తులు 16 కోట్లు

  Written by : Updated: Tue, Mar 26, 2019, 04:48 PM
 

లక్నో : రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్డీ) అధినేత అజిత్ సింగ్ తన ఆస్తులను ఎన్నికల ఆఫిడవిట్‌లో పొందుపరిచారు. స్తిర, చరాస్తులు కలిపి మొత్తం రూ. 16.61 కోట్ల ఆస్తులున్నట్లు ఆయన తెలిపారు. అజిత్ సింగ్‌కు సొంతంగా వాహనం లేదు. ఆయనపై క్రిమినల్ కేసులు కూడా లేవు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ పొత్తులో భాగంగా అజిత్ సింగ్.. ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.