పెండింగ్‌లో వైసీపీ అభ్యర్థి నామినేషన్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 03:14 PM
 

రాజమండ్రి: మండపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వరరావు పెండింగ్‌లో పెట్టారు. మాజీ ఎమ్మెల్యేగా ఆయన తీసుకుంటున్న పెన్షన్‌ను అఫిడవిట్‌లో నమోదు చేయకపోవడమే దీనికి కారణం. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ రాజమండ్రి మండపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.