కేఏ పాల్‌ నామినేషన్లు ఆమోదం

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 03:08 PM
 

నరసాపురం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్‌ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో  నామినేషన్ల పరిశీలన చేపట్టారు. పత్రాలు అన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్‌ వేసిన నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.