నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 03:05 PM
 

అమరావతి : మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నామినేషన్ వేయగా, నోటరీ మాత్రం కృష్ణా జిల్లాకు చెందినది సమర్పించారు. దీంతో అది చెల్లదన్న వాదన వినిపిస్తున్నది. కాగా అధికారులు నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఆలా ఉండగా నోటరీ నిబంధనలను అభ్యర్థి తరఫు ప్రతినిథులు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన భోజన విరామం అనంతరం కూడా కొనసాగుతుంది.