వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: పవన్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 02:58 PM
 

నెల్లూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని అవమానపరుస్తున్నారన్నారు. పోలీసులపై ఇకనైనా విమర్శలు మానాలని గట్టిగా చెబుతున్నానని పేర్కొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే 6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని  అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 10లక్షలు ఉద్యోగాలు తయారు చేస్తామన్నారు. లక్ష మంది కొత్త రైతులను తయారు చేస్తామన్నారు. ఏడాదికి 6 నుంచి 10 సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితుల్లో రోజుకు రూ.500 అందజేస్తామన్నారు.