పింఛన్లు రూ.2వేల నుంచి రూ.3వేలు చేస్తా: చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 02:16 PM
 

కడప: వృద్ధాప్య పింఛన్లను రూ.2వేల నుంచి 3వేల రూపాయలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నానన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేశామన్నారు. దుల్హన్‌ పథకం కింద రూ.లక్ష ఇస్తానని హమీ ఇస్తున్నానని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. మైనార్టీల కోసం హజ్‌ హౌస్‌లు నిర్మిస్తున్నామన్నారు.