జగన్‌ తప్పకుండా సీఎం అవుతారు: మోహన్‌బాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 01:33 PM
 

హైదరాబాద్‌:  ఏపీలో వైసీపీ అధినేత జగన్‌ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని సినీనటుడు, నిర్మాత మోహన్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీలోకి చేరారు. అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ తాను పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. జగన్‌ సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. వైసీపీలో జగన్‌ ఎలాంటి బాధ్యత ఇచ్చినా పని చేస్తానని పేర్కొన్నారు. చంద్రబాబును అగౌరవపర్చాలని తనకు లేదని, చంద్రబాబును ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి ఎన్నోసార్లు అడిగానన్నారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు. మూడు మాసాలకు ఒకసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామన్నారని పేర్కొన్నారు. మా విద్యా సంస్థలకు రూ.19 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావాలన్నారు. చంద్రబాబు చేసిన వాగ్దానాలనే నెరవేర్చమని అడుగుతున్నానన్నారు.