ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్ర‌చారానికి మెగా హీరోలు ఆమ‌డ దూరం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2019, 06:49 PM

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ హోరాహోరి తలపడుతుంటే, పవన్ కళ్యాణ్ దూసుకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ మాటల యుద్ధం చేస్తున్నాయి. టీడీపీకి సినిమా గ్లామర్ దివ్యవాణి మాత్రమే కనబడుతుంటే, కానీ వైసీపీకి మాత్రం పలువురు యాక్టర్స్ మద్దతిస్తున్నారు. ఇక జనసేన సినిమా గ్లామర్ పార్టీనే. పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ హీరోగా ఉన్న టైంలోనే, రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అన్నగారు ప్రజారాజ్యం పార్టీతో సాధించలేనిది, జనసేన తో సాధిస్తాను, ఒక్కసారి సీఎం పదవి ఇవ్వండి అంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు. మరి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు, ఆ ఎన్నికల కోసం మెగా ఫ్యామిలీలోని హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రచారానికి రోడ్డెక్కారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మెగా హీరోలు ఎవరూ పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడేటట్లు కనిపించడం లేదు. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు వున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారానికి, కేవలం 16 రోజుల టైం మాత్రమే ఉంది. బాలకృష్ణని ట్రోల్ చేస్తూ, వీడియోస్ రూపంలో గలాటా చేసిన నాగబాబు ,నిన్నగాక మొన్న జనసేనలోకి చేరి నర్సాపురం ఎంపీ టికెట్ సంపాదించాడు. గతంలో ఫ్యాన్స్ మెగా ఫ్యామిలిని పవన్ ఎక్కడంటూ అడిగినప్పుడు, వాడి గురించి నాకు తెలియదని విసుక్కున్నాడు నాగబాబు. సరే అదలా ఉంటే రామ్ చరణ్, బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నాని అన్నాడు కానీ, ప్రస్తుతం ఆ ఊసే లేకుండా రాజమౌళి సినిమా "RRR" షూటింగ్ తో పొరుగు రాష్ట్రం వెళ్లిపోయాడు. ఇక చిరంజీవి "సైరా" షూటింగ్ లో బిజీగా వున్నాడు. ప్రజారాజ్యం ను పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కోసం యూరాజ్యం అని పెట్టి రాష్ట్రంలో పర్యటించాడు. ఇప్పుడు మాత్రం అన్న తమ్ముడికి సహాయం అందించడంలేదు. చిరు ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలిపి మంత్రి అయ్యాడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకి కూడా చిరు దొరకడం లేదు. మరోపక్క వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి మెగా హీరోలు కూడా జనసేనపై స్పందించడానికి జంకుతున్నారు. ఇక అల్లు ఫామిలీ అస్సలే మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్, ఎక్కడా జనసేన గూర్చి మాట్లాడడం లేదు. మరి మెగా హీరోల గ్లామర్ జనసేనకు అందనట్టే కనబడుతుంది. నాగబాబు ఒక్కడే పవన్ కళ్యాణ్ భజన చెయ్యాల్సిన పరిస్థితి. మరి రెండు చోట్ల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ తో తన సీట్స్ లో గెలిచేస్తాడేమో కానీ, మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇక మెగా ఫ్యామిలీ రాకపోతేనే బెటర్ అన్నట్టుగా పవన్ కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మెగా హీరోలు అందరు దిగినా పని జరగలేదు. అందుకే ఈసారి ఒంటరిగానే పవన్ కష్టపడుతున్నారు.


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com