ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్ లో టీవీలు ఆపేసి రాష్ట్రాన్ని విభజించారు : నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 06:39 PM

మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు నారా లోకేష్ ...రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు. రాష్ట్ర విభజన కంటే,విభజన చేసిన తీరు బాధించింది. పార్లమెంట్ లో టీవీలు ఆపేసి రాష్ట్రాన్ని విభజించారు సింగపూర్ మలేషియా నుండి విడిపోయినప్పుడు అసలు ఆ దేశం కొలుకుంటుందా అని అందరూ అభిప్రాయపడ్డారు కానీ అతి తక్కువ సమయంలో సింగపూర్ ,మలేషియా తో పోటీ పడింది . కేవలం బలమైన నాయకత్వం వలనే అది సాధ్యం అయ్యింది 


రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని ఎక్కడో తెలియదు,కనీసం ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. సంక్షోభంలో అవకాశం వెతుక్కుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నాం. అలాంటిది 5 ఏళ్లలో ప్రజా రాజధాని నిర్మించుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది . అభివృద్ధి అంతా ఒకే చోట కాకుండా అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్నాం 


ఫాక్స్ కాన్, కియా,ఇసుజూ, హెచ్ సిఎల్,కాన్డ్యూయెంట్,కర్నూల్ లో సోలార్ పార్క్ ఇలా అనేక కంపెనీలు అనేక జిల్లాల్లో వచ్చాయి. విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్తు . వ్యవసాయం,పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించాం. తలసరి ఆదాయం లో వృద్ధి సాధించాం. 15 శాతం వృద్ధి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. అత్యంత వేగంగా వృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.రెండంకెల వృద్ధి సాధించాం ఐటీ,ఎలెక్ట్రానిక్స్ రంగంలో వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరిలో ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి 


ఇప్పటికే 40 కంపెనీలు మంగళగిరికి  వచ్చాయి.3,300 ఉద్యోగాలు వచ్చాయి. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం మాత్రమే చెయ్యాలి అనే ఆలోచన మారి పరిశ్రామికవేత్తలుగా  మారి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి చిన్న,మధ్య తరగతి కంపెనీల వలన అనేక ఉద్యోగాలు వస్తాయి. టెక్నాలజీ సహాయంతో గ్రామాలకు మెరుగైన వసతులు కల్పించగలుగుతున్నాం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com