ఎన్నికల్లో పోటీకి సై : నచ్చావులే ఫేం మాధవీలత

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 07:22 PM
 

ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న తరుణంలో నచ్చావులే ఫేం మాధవీలత సైతం తాను కూడా పోటీకి సై అంటోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. ఆదివారం ఆమెను గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. 10 మంది అభ్యర్థులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై దరఖాస్తు చేసుకోగా సినీనటి మాధవీలతను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం.
ఇకపోతే ఈ ఎన్నికల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చెయ్యని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్ నుంచి సినీనటుడు మార్గాని భరత్, విజయవాడ పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ బరిలో ఉన్నారు. వీరితోపాటు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకు నేందుకు రెడీ అయ్యారు సినీనటి రోజా, చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్. సినీనటుడు అలీ కూడా పోటీ చేద్దామని భావించినప్పటికీ జగన్ సీటు ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకే పరిమితమయ్యారు.