రాష్టానికి నేనే నెంబర్ వన్ డ్రైవర్: చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 06:57 PM
 

గుంటూరు టీడీపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ... రాష్టానికి నేనే నెంబర్ వన్ డ్రైవర్. అందరి ఆమోదంతోనే మన రాజధానికి అమరావతి అని పేరుపెట్టమన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మీ విజయ రహస్యం ఏంటని ప్రశ్నిస్తే తాను ఒక్కటే చెప్తానని.. 65 లక్షల సైనికులే నా విజయ రహస్యమన్నారు. ఎన్ని ఎన్నికలొచ్చినా నా సైనికులుండగా నాకు భయమెందుకన్న చంద్రబాబు కోటిమంది డ్వాక్రా మహిళల చెల్లెమ్మలున్న ఏకైన అన్నయ్యను కూడా తానేనన్న చంద్రబాబు ఎన్నికలంటే తనకు భయం లేదని.. అందరి భవిష్యత్ కోసం ఇంకా కష్టపడానికి తాను సిద్ధమన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహమీ నెరేవేర్చాకే ఎన్నికలకు వస్తానని చెప్పానని.. హామీలు నెరవేర్చి మీ ముందుకు వచ్చి ఓట్లు వేయాలని అడుగుతున్నామన్నారు.