నాలుగు విమానాల్ని రద్దు చేసిన జెట్ ఎయిర్ వేస్

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 06:55 PM
 

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ మరో నాలుగు విమానాలను రద్దు చేసింది. లీజులు చెల్లించలేక పక్కన పెట్టిన జెట్‌ఎయిర్‌వేస్‌ విమానాల సంఖ్య వీటితో 41కు చేరింది. ఇప్పటికే లీజుదారులకు జెట్‌ఎయిర్‌వేస్‌ అందుబాటులో ఉండి నగదు సేకరణ సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ఆ నాలుగు విమానాలకు చెల్లించాల్సిన మొత్తాలు భారీగా పేరుకుపోయాయి కాబట్టే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి అందజేసిన సమాచారంలో జెట్ ఎయిర్ వేస్ అధికారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం జెట్‌ఎయిర్‌వేస్‌ వద్ద మొత్తం 119 విమానాలు ఉన్నట్లు సమాచారం.