కడప స్టీల్ ఆలోచన చేయ‌ని చంద్ర‌బాబు : జగన్

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 05:29 PM
 

 మీ భవిష్యత్తు. నా భరోసా అంటూ ప్రచారం చేస్తున్న చంద్రబాబు, అసలు ఈ అయిదేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు జ‌గ‌న్‌. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సోమవారం మధ్యాహ్నం బహిరంగ సభలో జగన్‌ పాల్గొని ప్రసంగిస్తూ, చంద్రబాబు  ఏనాడూ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆలోచన చేయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు చేసిన తొలి అయిదు సంతకాలు ఏమయ్యాయని నిలదీశారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశారా?, చేనేతకారుల రుణాలు మాఫీ అయ్యాయా?, గ్రామాల్లో రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తున్నారా?, బెల్టు షాపులు ఎత్తివేశారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు ఎలా భరోసా ఇస్తారని నిలదీశారు.