వివేకా హత్యతో నాకు సంబంధం లేదు: పరమేశ్వర్‌రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 04:34 PM
 

తిరుపతి:  వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని హత్య కేసులో అనుమానితుడు, సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన పరమేశ్వరరెడ్డి అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మాట్లాడుతూ అనవసరంగా ఈ కేసులో తనను ఇరికిస్తున్నారన్నారు. ఇది ఇంటి దొంగల పనేనన్నారు. రాజకీయ కుట్ర కోసం వాడుకుంటున్నారన్నారు. గుండె సమస్య ఉంటే తిరుపతిలో చికిత్స తీసుకుంటున్నానన్నారు. మాకెలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడంతోనే వివేక అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానన్నారు.