లోటస్ పాండ్ లోని వైఎస్.జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కు పరాభవం ఎదురైంది. సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌కు వచ్చారు. రెండు గంటలపాటు జగన్ నివాసం వద్దే ఉన్నా ఆయనను లోపలికి అనుమతించలేదు. వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే ఉన్నా సునీల్ ను కనీసం పలకరించలేదు. చూడకుండా వెళ్లిపోవడంతో సునీల్ మనస్తాపానికి గురైనట్లు అనుచరులు తెలిపారు. తన నివాసం వద్దకు రావద్దని జగన్ సునీల్ కు జగన్ స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.