ఎన్నికల అధికారుల తనిఖీల్లో 30 కేజీల బంగారం పట్టుబడింది. పశ్చిమ గోదావరి జల్లా నారాయణపురం టోల్ గేట్ వద్ద తనిఖీలు చేస్తుండగా బంగారం తరలింపు వెలుగు చూసింది. బంగారం బిస్కట్ల విలువ సుమారు రూ.10 కోట్లకు పైనే ఉంటుంది. దొరికిన బంగారాన్ని ఆదాయపు పన్ను అధికారులకు అందచేస్తామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులకు తెలియచేస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టోల్ గేట్లు, ప్రధాన రోడ్లపై ఎన్నికల అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వస్తే సదరు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే వదిలేస్తున్నారు. బంగారం, ఆభరణాలు, నగదు ఎవరు తరలించినా దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తే వదిలేస్తారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తే కేసులు నమోదు చేస్తారు.