టీడీపీ ఎమ్మెల్యేకు మావోయిస్టుల పేరుతో లేఖలు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:11 PM
 

టీడీపీ ఎమ్మెల్యే యరపతినేనికి మావోయిస్టుల పేరుతో లేఖలు అందాయి. యరపతినేని, పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు పంపించారు. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. మరోవైపు ఈ లేఖలపై యరపతనేని శ్రీనివాసరావు స్పందించారు. ‘‘లేఖలు వైసీపీ పనే. లేఖలపై పోలీసులు దర్యాప్తు చేయాలి’’ అని యరపతినేని డిమాండ్ చేశారు. మావోల పేరుతో లేఖ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.