రంపచోడవరం టీడీపీలో విబేధాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:07 PM
 

రంపచోడవరం టీడీపీలో విబేధాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి టిక్కెట్ ఇవ్వద్దంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వంతల రాజేశ్వరి టీడీపీ కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతల రాజేశ్వరికి టిక్కెట్ ఇస్తే సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ఈ నియోజకవర్గం కుంటుపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర క్రితం వంతల రాజేశ్వరి వైసీపీ నుంచి టీడీపీలో వచ్చారని, ఇక్కడ 30 ఏళ్లనుంచి టీడీపీలో ఉన్న నాయకులను ఆమె పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ నిర్వీర్యం కావడం తమకు ఇష్టం లేక సీఎం దృష్టికి తీసుకువస్తున్నామని అన్నారు. ఆమె తప్ప గెలిచే అభ్యర్థి ఎవరికి ఇచ్చినా తాము మద్దతుగా ఉండి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.