జగన్‌పై ఎన్నికల సంఘానికి దివ్యవాణి ఫిర్యాదు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:04 PM
 

సాక్షి పత్రిక, జగన్‌పై ఏపీ ఎన్నికల సంఘ ప్రధాన కమిషనర్ గోపాల్ కృష్ణ ద్వివేదికి టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌ ఆనందసూర్య ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రికలో రిటైర్డ్‌ సీఎస్‌ అజయ్‌కల్లాంతో ఆర్టికల్‌ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని దివ్యవాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.60 లక్షల టారిఫ్ అయ్యే ఇంటర్వ్యూ రాయించుకున్నారని తెలిపారు. సాక్షి పత్రికను పార్కులు, వీధుల్లో ఉచితంగా ఇస్తున్నారని దివ్యవాణి చెప్పారు. రూ. 60 లక్షలను ఎన్నికల ఖర్చు కింద జగన్‌ అకౌంట్‌లో రాయమని ఈసీని కోరినట్లు దివ్యవాణి మీడియాకు తెలిపారు.