ట్రెండింగ్
Epaper    English    தமிழ்

32 మంది అభ్యర్థులతో జనసేన తొలి జాబితా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 07:12 PM

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కావడతో ఏపీలో పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. టీడీపీ ఇప్పటికే 135 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తొలిసారి బరిలోకి దూకుతున్న జనసేన కూడా స్పీడ్ పెంచింది. ప్రస్తుతానికి 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను,  తొమ్మదిమంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. జాబితాను రేపోమాపో విడుదల చేసే అవకాశముంది.
అయితే జాబితాలోని పేర్లు ఇవీ మీడియాలో ఇప్పటికే కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.  అసెంబ్లీ అభ్యర్థుల్లో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, పసుపులేటి బాలరాజు, , మాజీ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరిదేవి తదితరులు ఉన్నారు. కాగా, ట్వీట్ వదిలాక పవన్ మరో ప్రకటన చేశారు.  అమలాపురం నుంచి ఓఎన్జీసీ విశ్రాంత అధికారి డీఎంఆర్‌ శేఖర్‌, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణను బరిలో దింపుతున్నట్టు  వెల్లడించారు. మీడియాలో తిరుగుతున్న జాబితా ప్రకారం..
అసెంబ్లీ అభ్యర్థులు- తూర్పుగోదావరి-
కడప- సుంకర శ్రీనివాస్
ధర్మవరం- మధుసూదన్ రెడ్డి
కాకినాడ రూరల్ – అనిశెట్టి బుల్లబ్బాయ్
తుని – రాజా అశోక్ బాబు
మండపేట- దొమ్మేటి వెంకటేశ్వర్లు
పలాస- సుజాతా పాండా
ఎచ్చెర్ల- జనార్ధన్
రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్ 
తెనాలి- నాదెండ్ల మనోహర్
గుంటూరు పశ్చిమ – తోట చంద్రశేఖర్
మమ్మిడివరం – పితాని బాలకృష్ణ
ప్రత్తిపాడు – రావెల కిషోర్ బాబు
పాడేరు- పసుపు లేటి బాలరాజు
కావలి- పసుపు లేటి సుధాకర్
ఏలూరు- నర్రా శేషు కుమార్
కాకినాడ సిటీ – పంతం నానాజీ
తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాసరావు
రాజోలు – రాపాక వరప్రసాద్
పి. గన్నవరం – పాముల రాజేశ్వరి దేవి
పాతపట్నం- యశస్విని
గురజాల- చింతలపూడి శ్రీనివాస్
నరసరావుపేట- జిలానీ
అవనిగడ్డ- ముత్తంశెట్టి కృష్ణారావు
ఎంపీ అభ్యర్ధులు:
కాకినాడ- మారిశెట్టి రాఘవయ్య,
రాజమండ్రి– ఆకుల సత్యనారాయణ
అనకాపల్లి- చింతల పార్ధసారది
అమలాపురం- డీఎంఆర్ శేఖర్
శ్రీకాకుళం- గేదెల శ్రీనుబాబు
2014లో తమ పార్టీ ఆవిర్భావ సభకు కూడా ఆయన తన సన్నిహితులతో కలిసి వచ్చారని, తమ ఇద్దరి భావజాలం కలిసిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అలాగే 2014 ఎన్నికల్లో భాజపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణతోనూ తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వీరిద్దరూ ఎంపీలుగా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్‌ ఆకాంక్షించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com