రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ తరఫున ఎంపీ గొల్లబాబు రావు మాట్లాడారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పోరేషన్లకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తగిన నిధులు ఇవ్వడం లేదు. దీని కారణంగా పేదలకు అన్యాయం జరిగింది. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ.. సోషల్ ఇంజస్టిస్ మినిస్ట్రీగా మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతిలో హామీ ఇచ్చారు.. దాన్ని నిలబెట్టుకోలేదు. ఏపీకి తగిన న్యాయం చేయాలి. 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బాధ్యత ను ఎందుకు ఎత్తుకుంది?, కేంద్రం పోలవరంకు సరైన నిధులు ఇవ్వడం లేదు. పోలవరం ఎత్తును 45 నుంచి 41 మీటర్లకు తగ్గిస్తే ఏపీ ప్రజలు ఊరుకోరు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. రైల్వే జోన్ శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభించలేదు’అని గొల్లబాబూ రావు స్పష్టం చేశారు.
![]() |
![]() |