ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దాపురం నుంచి జనసేన అభ్యర్థిగా చినరాజప్ప సోదరుడు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 23, 2019, 10:18 AM

తెలుగుదేశం నాయకుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారా? ఆయన స్వయంగా తన సోదరుడు నిమ్మకాయల చినరాజప్పపైనే పోటీ చేస్తారా? పరిస్థితులను గమనిస్తుంటే అదే జరుగుతుందా అనిపిస్తున్నది. నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల చినరాజప్ప తాను పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమని పేర్కొంటూ జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటాను సమర్పించారు. చినరాజప్ప ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకర్గం నుంచే జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఆయన సోదరుడు లక్ష్మణమూర్తి జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా సమర్పించడం సంచలనం సృష్టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com