ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమల్లోకి వచ్చిన కాపు రిజర్వేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 09:15 AM

ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ పదిశాతం రిజర్వేషన్‌ను ఏపీ ప్రభుత్వం కాపులు, ఇతర కులాలకు సమానంగా పంచింది. ఇందులో భాగంగా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం వల్ల కాపులకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఈబీసీలకు మిగతా ఐదు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. కాగా, కాపులకు ఐదు శాతం, ఈబీసీలకు ఐదు శాతం రిజర్వేషన్‌ను అమల్లోకి తెచ్చినట్టు పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com