రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి బుధవారం వచ్చిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యలు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గోరంట్ల కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపన్ని తెలియజేశారు... తనకు అత్యంత సన్నిహితులలో గోరంట్ల కుటుంబం ఒకరని, వారి తండ్రి వీరయ్యసైతం తనకు మార్గదర్శి అన్నారు. ఆతని మృతి గోరంట్ల కుటుంబానికే కాదు నాకూ తీరనిలోటు అని హోంమంత్రి వ్యాఖ్యానించారు .
అలాగే బుచ్చయ్య చౌదరిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోన్ లో పరామర్శించి తన ప్రగాడ సంతాపం తేలియజేశారు గతంలో వీరయ్య గారితో ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు...ఎప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండే వ్యక్తి అని అన్నారు...దైర్యంగా ఉండాలని చెప్పారు....