సోలార్ విద్యత్తు ఒప్పందాల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జగన్ అడ్డంగా బుక్కై, ఇప్పుడు బుకాయిస్తే కుదరదని అన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో జగన్ పేరు లేదట.. ఏపీ సీఎం అని ఉందట.. 2021 సీఎం ఆయన కాదా అని ప్రశ్నించారు.
2014 ధరలతో పోల్చుకుని 2021లో తక్కువ ధరకి కొనుగోలు చేశామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించే ప్యానళ్ల ఖర్చు రూ.15కోట్లు. ఇప్పుడవే ప్యానళ్ల ఖర్చు రూ.50లక్షలు అయ్యాయని తెలిపారు. జగన్‌పై ఉన్న రెండు డజన్ల కేసుల సంగతేమో కానీ, ఈ కేసులో ఫలితం అనుభచించక తప్పదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.