న్యూఢిల్లీ : ఢిల్లీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక చెప్పుల దుకాణంలో ఈ తెల్లవారు జామున మంటలు ఎగసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.