మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా వ్యవహరించాలని జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరెన్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన అన్నారు. జెఎంఎం, కాంగ్రెస్‌లు తమ పాత గొడవలను వదిలేసి, రాష్ట్రీయ జనతా దళ్, జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్లతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయని ఆయన చెప్పారు.