నేటి నుంచే టిడిపి ఎన్నిక‌ల ప్ర‌చారం

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:50 AM
 

సార్వత్రిక ఎన్నికల‌ ప్రచారాన్ని  ఆదివారం నుంచి ప్రారంభిస్తామని ఏపీ మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శ‌నివారం ఆయ‌న అమరావతిలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ  ఎన్నిక ప్రకటనకు ముందే కొన్ని స్థానాల‌కు అభ్యర్థుల‌ను ప్రకటించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణ‌యించింద‌ని అన్నారు.  అభ్యర్థుల‌ ఎంపికలో సమర్థత, పనితీరుకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. . ఇరు రాష్ట్రాల్లో పొత్తుపై పోలిట్ బ్యూరోల చ‌ర్చించామ‌ని,  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచను జరిపిన‌ట్టు చెప్పారు.  . నేతల వల‌సలు, చేరికపై కూడా చర్చించారు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాల‌ని సోమిరెడ్డి పేర్కొన్నారు.   సీట్ల సర్దుబాటులో విబేధాల‌ వల్లే కొందరు పార్టీని వీడుతున్నారని,  ఎన్నికకు ముందు తెదేపాను వీడిన నాయకులే నష్టపోతారని పేర్కొన్నారు.   .