రైతు సంక్షేమం ప‌క్కాగా అమలు కావాల్సిందే : అచ్చెన్న‌

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:44 AM
 

రైతుల‌కు సంబంధించి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప‌క్కాగా అమ‌లు కావాల‌ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి   కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీ‌కాకుళం జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిల్లాలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం లో ఆయ‌న వ్యవసాయ శాఖ అధికారుల తో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి  కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న సాయం అర‌కొర‌గా ఉండ‌టంతో ముఖ్య‌మంత్రి 5 ఎక‌రాలున్న రైత‌లుకు మ‌రి 9 వేలు అందించేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ని, దీంతో రైతుల‌కు 15 వేలు వ‌ర‌కు అంద‌నుంద‌ని అన్నారు. రైతు రుణ మాఫీతో స‌హా ప్ర‌తి కార్య‌క్ర‌మం పూర్తి అయ్యేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.