కాంగ్రెస్‌లో ముగిసిన దరఖాస్తు స్వీకరణ

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:29 AM
 

కాంగ్రెస్‌లో ఆశావహుల‌ నుంచి దరఖాస్తుల‌ స్వీకరణ పూర్తయ్యింది. మొత్తం 98 మంది అభ్యర్థులు అసెంబ్లీ టికెట్లను ఆశిస్తుండగా, మరో 18 మంది పార్లమెంట్‌ సీట్లను ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాలుండ‌గా  వాటిలో పోటీ చేయడానికి ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు అభ్యర్థు నుంచి మచిలీపట్నంలో దరఖాస్తు స్వీకరించారు. తర్వాత జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో దరఖాస్తు స్వీకరణకు తేదీను పొడిగించాల‌ని పలువురు కోరారు. దీంతో 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు   ఆశావహుల‌ నుంచి దరఖాస్తు స్వీకరించారు. ఈ ప్రక్రియ  ముగిసింది. మొత్తం 98 మంది అభ్యర్థులు అసెంబ్లీ టికెట్లకు దరఖాస్తు చేసుకున్నారు.  వీటిని పూర్తి స్థాయిలో ప‌రిశీలించాక అధిష్టానం అభ్య‌ర్ధుల‌ను నిర్జ‌యిస్తుంద‌ని పిసిసి వ‌ర్గాలు చెప్పాయి.