వారిని ప్రజలు ఆదరించరు : చినరాజప్ప

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:24 AM
 

ఎన్నిక‌ల ముందు సొంత ప్ర‌యోజ‌నాల కోసం  పార్టీలు  మారిన వారిని ప్రజలు ఆదరించరని, ఆమంచి, అవంతి కాపు ద్రోహులుగా నిలిచారని హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. శనివారం అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్‌ పార్టీలోకి ఇరువురు నేత‌లు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఆమంచి, అవంతిని ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారని   వైసీపీ అధికారంలోకి రాదని, మంత్రి పదవు ఎలా వస్తాయని అన్నారు.