ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఇంద్రకీలాద్రి

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:21 AM
 

కనకదుర్గమ్మ స్వయంభువుగా వెలిసిన ఇంద్రకీలాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన నిధుల‌ను కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అమలుచేస్తున్న పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్‌ అండ్‌ స్పిరుచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌ (పీఆర్‌ఏఎస్‌ఏడీ) ద్వారా పొందేందుకు దుర్గగుడి అధికారులు సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. ఈ నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో తిరుమల‌ తిరుపతి దేవస్థానం తర్వాత రెండో పెద్ద దేవాల‌యం కనకదుర్గమ్మ ఆల‌యమే.   ఇంద్రకీలాద్రికి ప్రతిరోజూ 35 నుంచి 40 వే మంది భక్తు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.  ప్రతిఏటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో అయితే పది రోజుల్లో సుమారు 20 ల‌క్షల‌ మంది భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ తాకిడి కూడా ఎక్కువే.   ఇంద్రకీలాద్రిని పర్యాటకును విశేషంగా ఆకర్షించే సరికొత్త సందర్శనీయ క్షేత్రంగా, ప్రపంచస్థాయి ఐకాన్‌గా దిద్దాల‌ని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ పట్టుదల‌గా   కేంద్ర పర్యటక శాఖ అమలుచేస్తున్న ప్రసాద్‌’ స్కీం ద్వారా నిధుల‌ మంజూరు చేయాల‌ని కోరుతూ ఇప్పటికే ఆమె దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ అధికారులు డీపీఆర్‌ పంపిం చాల‌ని సూచిస్తూ ఓ కన్సల్టెన్సీ సంస్థను కూడా అటాచ్‌ చేశారు. కేంద్ర పర్యాటకశాఖ నుంచి సానుకూ స్పందన రావడంతోనే దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ, ఎగిక్యూటివ్‌ ఇంజనీరు డి.వి.భాస్కర్‌ నేతృత్వంలో నిపుణుల ప్రాథమిక డీపీఆర్‌ను సిద్ధం చేశారు. దానిని రాష్ట్ర పర్యాటకశాఖ ద్వారా కేంద్ర పర్యాటక శాఖకు పంపించనున్నారు. కేంద్రానికి చేరిన డీపీఆర్‌ను సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ (సీఎస్‌ఎంఎస్‌) పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఎక్కడా అడ్డంకులు లేకుండా సాగిపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వంద శాతం  గ్రాంటుగా మంజూరవుతాయి.  . ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం ‘ప్రసాద్‌’ పథకానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం రూ. 50 కోట్లతో అభివృద్ధి పను కొనసాగుతున్నాయి. అదే తరహాలో దుర్గమ్మ దేవస్థానం అభివృద్ధికి కూడా కేంద్రం నిధుల‌ మంజూరు చేస్తుందన్న నమ్మకంతో దుర్గగుడి అధికారులుఉన్నారు.