కనకదుర్గ వంతెన బిల్లుల చెల్లింపుకు కేంద్రం యక్ష ప్రశ్నలు

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:15 AM
 

విజయవాడ కనకదుర్గ వంతెన నిర్మాణంలో మొదటి నుండి అడ్డంకులు ఎదురవుతూ జాప్యం జరుగుతూనే వుంది. చివరకు నిర్మాణం పనుల‌ వేగవంతం అవుతున్నాయనుకుంటే బ్లిల్లుల మంజూరులో జాప్యం జరుగుతున్నాయనుకుంటున్నారు.  ప్రాజెక్టు వివరాలిలా వున్నాయి కాంట్రాక్టు వ్యయం, రూ.282.40 కోట్లు, పెరిగిన వ్యయం రూ.340 కోట్లు, నిర్మాణ సంస్థ సోమా ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, నిర్మాణ దూరం 5.280 కి.మీ. పైవంతెన దూరం 6 వరసలు, 2.6 కి.మీ., నిర్మాణం ప్రారంభం 2015 డిసెంబరు 28, ఒప్పందం ప్రకారం గడువు: 365 రోజు, ప్రస్తుతం నిర్మాణం ఎంత పూర్తయింది అంటే  82 శాతం, ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు  రూ.55 కోట్లు, పెంచిన గడువు (ప్రతిపాదన) 2019 మే 14, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు రూ.123 కోట్లు, అదనంగా వల‌యా డక్టు ఖర్చు రూ.14.50 కోట్లు, ప్రార్థనామందిరం ప్రహరీ వ్యయం రూ.80 ల‌క్షలు. కేంద్ర నిధుల‌తో చేపట్టే ఈప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. నిధుల‌ మంజూరులో కేంద్రం కొర్రీలు వేస్తోంది. నిధుల మంజూరు జాప్యంవల్ల ప‌నుల‌కు ఆటంకం ఏర్ప‌డి వ్యయం ఏకంగా రూ.340 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకునిఈ ప్రాజెక్టు భూసేకరణ, ఇతర పనుల‌ కోసం రూ.138 కోట్లను వెచ్చిస్తోంది. కేంద్రం ఇవ్వాల్సిన రూ.340 కోట్లకుగాను ఇప్పటివరకు రూ.225 కోట్లు మాత్రమే అందాయి. 82 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ ప్రకారం ఇప్పటికే రూ.280 కోట్లు రావాల్సి ఉందని సమాచారం. ఈ లెక్కన కేంద్రం నుంచి మరో రూ.55 కోట్లు అందాల్సి ఉంది. ఈ రెండు నెలకు సంబంధించి కేంద్రం నుంచి రూ.11.60 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.4.80 కోట్లు రావాల్సి ఉంది. కేంద్ర బ్లిల్లుల‌ చెల్లింపులో బెంగళూరులో ఉన్న రహదారుల , రవాణా మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) ప్రాంతీయ కార్యాయం కొర్రీలు వేస్తోంది. ఒక విభాగం బిల్లుల చెల్లింపు ప‌క్క‌న పెట్టి  సంబంధిత పనున్నీ పూర్తి కావాల‌నే షరతు విధిస్తోంది. దీంతో  ఆయా ప్రాంతాల్లో క‌నీసం 60 శాతం పనుల‌ పూర్తయిన వాటికి కూడా  బ్లిల్లల‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని కాంట్రాక్టు వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. .