అన్నదాతకు సీఎం చంద్రబాబు మ‌రో శుభవార్త

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:06 AM
 

ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు సీఎం చంద్రబాబు నాయుడు మ‌రో శుభవార్త అందించారు. చిన్న, సన్నకారు రైతుల‌కు మేలు చేకూర్చే కీల‌క నిర్ణయం తీసుకున్నారు. ఐదెకరాల లోపు రైతుల‌కు రూ.9మే సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఐదెకరాల‌ లోపు అన్నదాతకు కేంద్రం ఇచ్చే సాయం రూ.6వేల‌తో పాటు రూ.9మలు కలిపి మొత్తం రూ.15వేలు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతుల‌కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఐదు ఎకరాల‌ కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు రూ.10మల‌ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. ఇవాళ జరిగిన టీడీపీ పొలిట్‌ బ్యూర్‌ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకంపై నేతల‌తో  చర్చించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న, సన్నకారు రైతులు దాదాపు 54ల‌క్షల‌ మంది వరకూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.