ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన వరిపంట పొలాలను పాలకొల్లు , పాలకోడేరు గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జునరావు, వ్యవసా యా దికారులు మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఆధైౖర్యపడాల్సిన అవసరం లేదని ముంపునకు గురైన వరి పంట పొలాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. భీమవరం వ్యవసాయ సహాయ సంచాలకులు సీహెచ్. శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి నారాయణరావు, సహాయకులు కె. సూర్యకృష్ణ, బీఎల్ స్వరూపరత్నం తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు రూరల్ గ్రామాలైన ఆగర్రు, ఆగర్తిపాలెం, దిగమర్రు, లంకలకోడేరు, వెలివెల, శివ దేవుని చిక్కాలలో ఏడీఏ అడ్డాల పార్వతి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యవసాయా ధికారి కె.రాజశేఖర్, సిబ్బంది, వీఆర్‌వోలు పాల్గొన్నారు. మొగల్తూరు మండలం మొగల్తూరు కోట రోడ్డు, గొల్లగూడెంలతోపాటు ఉన్నత పాఠశాల ఆవరణలో వర్షం నీరు నిలిచిపోవడంతో సర్పంచ్ పడవల మేరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంజన్లతో నీటిని బయటకు తోడిస్తున్నారు. మంగళవారం నీట మునిగిన వరి చేలను వ్యవసాయాధికారులు పరిశీలించారు. ఉండి మండలం యండగండిలో యనమదుర్రు డ్రెయిన్ గట్లను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్రెయిన్ ఆనుకుని వున్న చేలు ముంపుబారిన పడ్డాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.